లంక కుప్పకూలుతుంది అనుకుంటే టీమిండియాకు 265 పరుగుల టార్గెట్ ఇచ్చింది!
- టాస్ గెలిచిన శ్రీలంక
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 264 పరుగులు
- మాథ్యూస్ సెంచరీ, తిరిమన్నే హాఫ్ సెంచరీ
ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు భారత్ ముందు 265 పరుగుల లక్ష్యాన్నుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకను భారత బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీసినా, ఏంజెలో మాథ్యూస్ సెంచరీ (113), లహిరు తిరిమన్నే (53) అర్ధసెంచరీ సాయంతో గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. బుమ్రా ధాటికి ఓవర్లన్నీ ఆడడం కూడా కష్టమే అనుకుంటే, మిడిలార్డర్ చలవతో లంక 7 వికెట్లకు 264 పరుగులు చేసింది. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. భువీ, హార్దిక్, కుల్దీప్, జడేజా తలో వికెట్ తీశారు.