చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియాకు మొహంచాటేసిన టాస్

  • లీడ్స్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన శ్రీలంక
  • బ్యాటింగ్ ఎంచుకున్న లంక సారథి
  • రెండు మార్పులతో బరిలో దిగిన భారత్ 
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో నేటితో లీగ్ దశ ముగియనుంది. లీడ్స్ లో భారత్-శ్రీలంక, మాంచెస్టర్ లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ముందుగా, లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో భారత్, లంక జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ గెలిచి టోర్నీ లీగ్ దశను విజయంతో ముగించాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులతో బరిలో దిగుతోంది. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ స్థానంలో రవీంద్ర జడేజా తుదిజట్టులో ఆడుతున్నారు. 
Go Back to Shorts
Toss
World Cup
Team India
Sri Lanka

More Telugu News