బ్యాట్‌తో కొట్టినందుకు బాధలేదు.. మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాకూడదని కోరుకుంటున్నా: ఎమ్మెల్యే ఆకాశ్

  • పాత భవనాన్ని కూల్చుతుండగా అడ్డుకున్న ఆకాశ్
  • క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడి
  • అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు
నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ గంజ్ ప్రాంతంలో ఓ పాత భవనాన్ని కూల్చేందుకు అధికారులు యత్నించిగా అడ్డుకున్న స్థానికులకు అక్కడి ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వైరాగ్య మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మునిసిపల్ అధికారులు, ఆకాశ్‌కు మధ్య జరిగిన వాగ్వాదంలో ఆగ్రహించిన ఆకాశ్, క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడి చేశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

నేడు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్ మీడియాతో మాట్లాడతూ, తాను అధికారిపై దాడి చేసినందుకు బాధ పడటం లేదని, మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం తనకు కల్పించొద్దని భగవంతుణ్ని వేడుకుంటున్నానన్నారు. పోలీసుల ముందే ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించిన అధికారిని అంతకంటే ఏం చేయాలో తనకు అర్థం కాలేదని ఆకాశ్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Akash Vijay Vyragya
Cricket Bat
Madhya Pradesh
Jail
Old Building
Indore Gunj

More Telugu News