సుకుమార్ చేతుల మీదుగా 'దొరసాని' ట్రైలర్
- 'దొరసాని'గా శివాత్మిక
- ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ
- పెరుగుతోన్న అంచనాలు
యూత్ ను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా వచ్చేనెల 1వ తేదీన ఉదయం 10 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది. ఈ ప్రేమకథా చిత్రంపై అంచనాలు బాగానే వున్నాయి.