ఆఖరి ఓవర్లో రెండు సిక్స్ లు బాదిన ధోనీ... టీమిండియా స్కోరు 50 ఓవర్లలో 268/7
- కోహ్లీ, ధోనీ అర్ధసెంచరీలు
- రాణించిన పాండ్య, రాహుల్
- కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ధోనీ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు భారీ సిక్స్ లు, ఒక ఫోర్ తో విరుచుకుపడ్డాడు. దాంతో ఆ ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి. అంతకుముందు, ధోనీతో కలిసి హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. పాండ్య కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో కీమార్ రోచ్ 3 వికెట్లు తీయగా, కెప్టెన్ జాసన్ హోల్డర్, షెల్డన్ కాట్రెల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.