హైదరాబాదులో టీవీ నటి అదృశ్యం.. తల్లిదండ్రుల ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో టీవీ నటి అదృశ్యం.. తల్లిదండ్రుల ఫిర్యాదు

  • టీవీ నటి లలిత అదృశ్యం
  • అమీర్ పేట హాస్టల్ లో ఉంటున్న లలిత
  • ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
బుల్లితెర నటి లలిత హైదరాబాదులో అదృశ్యమైంది. అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన ఆమె పలు టీవీ సీరియళ్లలో నటిస్తోంది. అమీర్ పేటలోని ఓ హాస్టల్ లో ఆమె ఉంటోంది. ఈ నెల 11న ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకపోవడంతో... ఈరోజు హైదరాబాదుకు వచ్చి ఆరా తీశారు.

ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లలితను తీసుకెళ్లాడని ఆమెతో పాటు హాస్టల్ లో ఉంటున్నవారు చెప్పారు. దీంతో, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పోలీసులు మాట్లాడుతూ, బన్నీ అనే వ్యక్తి లలితను తీసుకెళ్లినట్టు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
lalitha
tv actress
missing

More Telugu News