టీచర్ ను కావాలని వుండేది .. హీరోయిన్ ను అయ్యాను: నళిని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీచర్ ను కావాలని వుండేది .. హీరోయిన్ ను అయ్యాను: నళిని

  • మాది సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం
  •  నన్ను హీరోయిన్ ను చేయాలనేది అమ్మ కోరిక
  •  7వ తరగతిలోనే హీరోయిన్ ను కావడం విశేషం  
నిన్నటితరం కథానాయికగా తెలుగుతో పాటు వివిధ భాషల్లో నళిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ధారావాహికలతో చాలా బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను చెన్నైలో పుట్టిపెరిగాను .. మాది సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం. అయితే నాకు మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. బాగా చదువుకుని .. టీచర్ ను కావాలనే కోరిక బలంగా ఉండేది.

కానీ మా అమ్మకి నన్ను హీరోయిన్ ను చేయాలని ఉండేది. అదే సమయంలో నేను స్కూల్ కి వెళ్లి వస్తుండగా ఇద్దరు నిర్మాతలు చూడటం, మా అమ్మను సంప్రదించడం జరిగిపోయాయి. అలా నేను తొలిసారిగా మలయాళ సినిమాలో కథానాయికగా నటించాను. అప్పటికి నేను చదువుతున్నది 7వ తరగతి మాత్రమే" అని చెప్పుకొచ్చారు.
nalini

More Telugu News