ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో ఎంపీ సుజనా చౌదరి భేటీ!
- ఇటీవల బీజేపీలో చేరిన సుజనా
- ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చ
- క్షేత్రస్థాయిలో కేడర్ పటిష్టతపై దృష్టి
ఈ సందర్భంగా 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడంపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం.