టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నారు..ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో!: ఎమ్మెల్యే కరణం బలరాం
- మోదీ, అమిత్ షాపై విమర్శలు
- బీజేపీలో చేరాలని మాజీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి
- ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉందో లేదో నాకు తెలియదు
రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం గురించి ఆయన వద్ద విలేకరులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కరణం బలరాం జవాబిస్తూ, ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడతారన్న సమాచారం తనకు లేదని, మాజీ ఎమ్మెల్యేలపై మాత్రం ఒత్తిడి చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని చెప్పారు.