Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత వారం రోజుల నుంచి స్పెయిన్ లోని వివిధ ప్రాంతాలలో జరుగుతోంది. నలభై ఐదు రోజుల భారీ షెడ్యూలును అక్కడ నిర్వహిస్తున్నారు.
*  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. దీంతో ఈ చిత్రం డబ్బింగ్ మొదలైంది. నిన్నటి నుంచి హైదరాబాదు, శబ్దాలయ థియేటర్ లో చిరంజీవి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు.
*  రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ మాల్దీవులలో ముగిసింది. అక్కడ రెండు పాటలను చిత్రీకరించామని చిత్ర నిర్మాత చార్మి పేర్కొంది. 
Go Back to Shorts
Keerthi
Chiranjivi
Nayanatara
Ram
Charmi

More Telugu News