ప్లీజ్.. ప్లీజ్.. రజనీకాంత్ సినిమాలోకి నన్ను తీసుకోరా?.. మురుగదాస్‌కు హాలీవుడ్ దిగ్గజ నటుడి విన్నపం
- టాక్ ఆఫ్ ది టౌన్‌గా బిల్ డ్యూక్ ట్వీట్
- ఏ పాత్రలోనైనా నటిస్తానన్న దిగ్గజ నటుడు
- ఆశ్చర్యపోయిన మురుగదాస్
దక్షిణాది సినిమాలపై ఇటీవల మనసు పారేసుకున్న హాలీవుడ్ దిగ్గజ నటుడు, ఫిల్మ్ మేకర్ బిల్ డ్యూక్ తాజాగా చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. రజనీకాంత్ దర్బార్ సినిమా గురించి తెలుకున్న డ్యూక్ తనకు ఆ సినిమాలో ఏదైనా పాత్ర ఇవ్వాలంటూ మురుగదాస్‌కు మొరపెట్టుకున్నాడు. తనకు సూపర్ స్టార్‌తో నటించాలని ఉందని, ఏదైనా చిన్న పాత్ర ఇవ్వాలని కోరాడు. అమెరికాలో ఉంటున్న రజనీ కజిన్‌గానో, లేదంటే నయనతార అంకుల్‌గానో ఏదో ఒక పాత్ర ఇవ్వాలంటూ ట్వీట్ చేశాడు. డ్యూక్ ట్వీట్ చూసిన మురుగదాస్ ఆశ్చర్యపోయాడు. ‘‘సర్.. నిజంగా మీరేనా?’’ అని ట్వీట్ చేశాడు.