మహిళా పోలీసును దారుణంగా చంపేసిన తోటి కానిస్టేబుల్!
Add ap7am to your home Screen

మహిళా పోలీసును దారుణంగా చంపేసిన తోటి కానిస్టేబుల్!

  • కేరళలో కిరాతకం
  • వెంటాడి హతమార్చిన వైనం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
కేరళలో అత్యంత కిరాతకమైన ఘటన జరిగింది. అళప్పుజ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ను సహచర కానిస్టేబులే హత్య చేయడం సంచలనం సృష్టించింది. వల్లికుణ్ణం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న సౌమ్య పుష్కరన్ (32)కు భర్త సంజీవ్, ఇద్దరు పిల్లలున్నారు. సంజీవ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సౌమ్య ఓ కార్యక్రమానికి హాజరై తన నివాసానికి వెళుతుండగా, అజాజ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను వెంబడించి కిరాతకంగా అంతమొందించాడు.

మొదట ఆమె స్కూటీని తన కారుతో ఢీకొట్టాడు. దాంతో సౌమ్య కిందపడిపోయింది. ఆమె పరిగెత్తేందుకు ప్రయత్నించగా, తన వద్ద ఉన్న కత్తితో విచక్షణరహితంగా నరికాడు. ఆ తర్వాత సీసాలో ఉన్న పెట్రోల్ ను పోసి నిప్పంటించాడు. దాంతో సౌమ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనలో అజాజ్ కు కూడా కాలినగాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Kerala

More Telugu News