Vijayawada: సీఎం జగన్ ను కించపరిచేలా టీడీపీ మహిళా కార్పొరేటర్ వాట్సప్ మెస్సేజ్!
విజయవాడ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూపులో అభ్యంతరకర మెస్సేజ్ ల వివాదం తెరపైకి వచ్చింది. సీఎం జగన్ ను కించపరిచేలా టీడీపీ మహిళా కార్పొరేటర్ శేషారాణి ఓ మెస్సేజ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై వైసీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ని కలిసి శేషారాణిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.