ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 212 పరుగులకు ఆలౌటైన వెస్టిండీస్
- చెరో మూడు వికెట్లు తీసిన వుడ్, ఆర్చర్
- పూరన్ 63 పరుగులు
- ఇంగ్లాండ్ టార్గెట్ 213 పరుగులు
మెరుపువీరుడు ఆండ్రీ రస్సెల్ 16 బంతుల్లో చకచకా 21 పరుగులు చేసినా వుడ్ బౌలింగ్ లో వెనుదిరగడంతో విండీస్ భారీ స్కోరు ఆశలు గల్లంతయ్యాయి. ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికొస్తే, వుడ్, ఆర్చర్ చెరో 3 వికెట్లు తీశారు. పార్ట్ టైమ్ బౌలర్ జో రూట్ కూడా రెండు వికెట్లు దక్కించుకోవడం విశేషం.