మనసుకు పట్టేస్తోన్న 'దొరసాని' లిరికల్ వీడియో సాంగ్
- మరో ప్రేమకథగా రానున్న 'దొరసాని'
- హీరోహీరోయిన్ల తొలిపరిచయం
- ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం
"నింగిలోని పాలపుంత నవ్వులొంపెనే .. నేలపైన పాలపిట్ట తొవ్వగాసెనే .." అంటూ ఈ పాట సాగుతోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం .. గోరెటి వెంకన్న సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని ఒకనాటి గడీలు .. ఓ గడీకి చెందిన అమ్మాయిని ఒక సాధారణ యువకుడు ప్రేమించడం .. దాని పర్యవసానాలతో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.