చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ ప్లాంట్ పై దాడి!
- గత రాత్రి పెరుగు కోసం వచ్చిన వ్యక్తి
- స్టోర్ మూసేశారని చెప్పడంతో ఆగ్రహం
- సెక్యూరిటీ ఆఫీస్ అద్దాలు ధ్వంసం
ప్లాంటు లోపలికి బలవంతంగా వెళ్లి అక్కడి కార్మికులను, ఉద్యోగులను బెదిరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా, హెరిటేజ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల బృందం హెరిటేజ్ సెంటర్ కు వచ్చి, ఆందోళనకారులను బయటకు పంపి, సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించి వివరాలు అడిగారు. కాగా, ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని జీడీ నెల్లూరు ఎస్ఐ నాగసౌజన్య వెల్లడించారు.