prabhas: 'సాహో' డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం దిల్ రాజు భారీ ఆఫర్?

షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ పెద్ద ఎత్తున వున్నట్టుగా తెలుస్తోంది.

నైజామ్ .. ఉత్తరాంధ్ర ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనకి ఇవ్వమంటూ దిల్ రాజు 45 కోట్లను ఆఫర్ చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఈ స్థాయిలో పోటీపడే డిస్ట్రిబ్యూటర్స్ లేకపోవడం వలన, ఈ ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకి ఖాయమైనట్టేనని అంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తయిన తరువాత, ఆయనతో దిల్ రాజు ఒక సినిమా ప్లాన్ చేయనున్నాడనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.
Go Back to Shorts
prabhas
shraddha kapoor

More Telugu News