జీడీపీలో భారత్ ను అధిగమించిన చైనా!
- ఐదేళ్ల కనిష్టానికి భారత జీడీపీ వృద్ధిరేటు
- మార్చితో ముగిసిన త్రైమాసికంలో 5.8 శాతం వృద్ధిరేటు
- 6.8 శాతం పురోగతి సాధించిన చైనా
అక్టోబరు నుంచి డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం ఉండగా మార్చితో ముగిసిన త్రైమాసికానికి భారీగా పడిపోయింది. కాగా, 2018-19లో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతమని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) పేర్కొంది. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతంగా ఉండడం గమనార్హం.