రైతులకు పెన్షన్లు... అన్నదాతపై మోదీ సర్కారు వరాల జల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైతులకు పెన్షన్లు... అన్నదాతపై మోదీ సర్కారు వరాల జల్లు

  • చిన్న, సన్నకారు రైతులకు పింఛన్లపై క్యాబినెట్ ఆమోదం
  • ఏటా 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేలు
  • ప్రతి రైతుకు కిసాన్ యోజన వర్తింపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన క్యాబినెట్ తొలిసారి సమావేశమైంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి అదనపు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద ఏటా 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతి రైతుకు కిసాన్ యోజన వర్తింపచేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా చిన్న, సన్నకారు రైతుల పెన్షన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Narendra Modi

More Telugu News