‘భారత్’ అనే టైటిల్ సరికాదు.. వెంటనే మార్చాలి: సల్మాన్ సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
- వాణిజ్య ప్రయోజనాల కోసం ‘భారత్’ను వాడకూడదు
- పాత్ర పేరును దేశంతో పోల్చడంపై అభ్యంతరం
- డైలాగ్‌ను డిలీట్ చేయాలని డిమాండ్
‘భారత్’ అనే పదాన్ని సినిమాకు టైటిల్‌గా వాడటం సరికాదని, వెంటనే దానిని మార్చాలని విపిన్ తన పిటిషన్లో కోరారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ‘భారత్’ అనే పదాన్ని వాడటం చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలో సల్మాన్ తన పేరును దేశంతో పోల్చడంపై విపిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ డైలాగ్‌ను చిత్రం నుంచి డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రం జూన్ 5న విడుదల కావాల్సి ఉంది.