Narendra Modi: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు

షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా ఎన్డీయే ప్రభంజనం కొనసాగిన నేపథ్యంలో నరేంద్ర మోదీ వరుసగా రెండో పర్యాయం ప్రధానిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. కొద్దిసేపటిక్రితం ఆయనతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ పత్రం చదివించారు. కాగా, ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన అతిరథ మహారథులు రావడంతో రాష్ట్రపతి భవన్ లో కోలాహలం అంబరాన్నంటింది. బిమ్ స్టెక్ దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు, రజనీకాంత్, కంగనా రనౌత్, కరణ్ జోహార్ వంటి సినీ తారలు, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం పళనిస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేశారు.
Go Back to Shorts
Narendra Modi

More Telugu News