వయనాడ్‌లో రాహుల్ ప్రభంజనం.. రికార్డు గెలుపును సొంతం చేసుకున్న కాంగ్రెస్ చీఫ్
- వయనాడ్‌లో 4.31 లక్షల మెజారిటీతో ఘన విజయం
- గత రికార్డులన్నీ బద్దలు
- అమేథీలో ఓడిన రాహుల్‌కు ఊరట
వయనాడ్‌లో రాహుల్ తన సమీప అభ్యర్థి, అధికార ఎల్‌డీఎఫ్ నేత పీపీ సునీర్‌పై 4,31,770 ఓట్లతో విజయం సాధించారు. 2014లో మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితం గోపీనాథ్‌రావు ముండే 6,96,321 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌పై విజయం సాధించారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వారి చెంతన రాహుల్ చేరారు.