బ్రెజిల్ బార్ లో కాల్పుల మోత.. 11 మందిని కాల్చిచంపిన దుండగులు!
- పారా రాష్ట్రంలోని బెలెమ్ నగరంలో ఘటన
- కార్లు, బైక్ లపై బార్ వద్దకు వచ్చిన ముఠా
- ఓ నిందితుడిని సజీవంగా పట్టుకున్న పోలీసులు
కాల్పుల అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా, వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ సందర్భంగా వీరిని వెంటాడిన పోలీసులు ఓ నిందితుడిని పట్టుకున్నారనీ, మిగతావారు తప్పించుకున్నారని పేర్కొన్నారు. గ్యాంగ్ వార్ కారణంగా ఈ అఘాయిత్యానికి తెగబడ్డారా? లేక మరేదయినా కారణం ఉందా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.