ప్రత్యేక సెట్లో చిరంజీవి, తమన్నాలపై పాట
- చిరు ప్రధాన పాత్రలో ‘సైరా’
- యువరాణి పాత్రలో తమన్నా
- రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అనంతరం వారం రోజుల పాటు వికారాబాద్ అడవుల్లో మరో షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన అనంతరం అన్నపూర్ణ ఏడు ఎకరాల్లో నిర్మించిన ప్రత్యేక సెట్‌లో తమన్నాతో కలిసి చిరు ఓ పాటకు స్టెప్పులేయనున్నారని సమాచారం. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. అనంతరం నిర్మాణానంతర పనులు జరిపి, ఆగస్ట్ 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.