bhanuchandar: నా కెరియర్లో నాకు ఇష్టమైన పాటలు అవే: సీనియర్ హీరో భానుచందర్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై యాక్షన్ సినిమాలతో సందడి చేసిన నిన్నటితరం హీరోల్లో భానుచందర్ ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "నేను నటించిన చిత్రాల్లో ఎన్నో మంచి పాటలు వున్నాయి. వాటిలో రెండు పాటలను మాత్రం ఎప్పటికీ మరచిపోలేము.

'మంచి మనసులు' సినిమాలో 'జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై ..' అనే పాట ఒక అద్భుతం. ఈ పాటను ఆత్రేయగారు రాయగా ఇళయరాజా గారు స్వరపరిచారు. ఇంతమంచి పాటను నా కెరియర్లో భాగం చేసినందుకు వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక 'నిరీక్షణ' సినిమాలోని 'సుక్కల్లే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడబోయావే' అనే పాట కూడా నాకు చాలా ఇష్టం. ఈ రెండు పాటలు నా కెరియర్లో తీపిగుర్తులుగా ఎప్పటికీ ఉండిపోతాయి" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
bhanuchandar

More Telugu News