Andhra Pradesh: చంద్రగిరి నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ కు ఈసీ నిర్ణయం

షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో రీపోలింగ్ జరపాల్సిన కేంద్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 19న రీపోలింగ్ ఉంటుందని ఈసీఐ పేర్కొంది. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో రీపోలింగ్ జరుపుతామని ఈసీ వర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Chittoor District

More Telugu News