కాంగ్రెస్ కండువా కప్పుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన కుమారస్వామి
- మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ లో సరైన గుర్తింపు దక్కలేదు
- ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సింది
- ఆయనకు అన్యాయం జరిగిందనేది నా అభిప్రాయం
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకునే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు, కాంగ్రెస్ కండువా కప్పుకుని కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడంతో... కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కుమారస్వామి... ఈ వ్యాఖ్యల ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నారనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.