ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధం విధించాలి: కన్నా లక్ష్మీనారాయణ
- గుంటూరులో ‘మద్యపాన నిషేధం’ అంశంపై చర్చ
- చర్చలో పాల్గొన్న అజయ్ కల్లాం, వైసీపీ నేతలు
- మద్య నిషేధంపై సమగ్ర చర్చ జరగాలని సూచన
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధం విధించవచ్చని అభిప్రాయపడ్డారు. అజయ్ కల్లాం మాట్లాడుతూ, ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదని సూచించారు. మద్యపాన నిషేధం కోసం స్వచ్ఛంద సంస్ధలు పోరాడాలని కోరారు. దశలవారీగా మద్య నిషేధంపై సమగ్ర చర్చ జరగాలని కోరారు.