ప్రకాశం జిల్లాలో పిచ్చికుక్క స్వైరవిహారం.. 10 మందికి తీవ్రగాయాలు!
- చెన్నారెడ్డిపల్లిలో ప్రజలను హడలెత్తించిన శునకం
- మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరిన బాధితులు
- పిచ్చి కుక్క బెడదను అరికట్టాలని అధికారులకు విజ్ఞప్తి
ఈ సందర్భంగా పిచ్చికుక్క దొరికినవాళ్లను దొరికినట్లు కరిచింది. దీంతో స్థానికులు కర్రలు, రాళ్లతో దాన్ని తరిమేశారు. ఈ పిచ్చికుక్క స్వైరవిహారం సందర్భంగా దాదాపు 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందనీ, ప్రమాదమేదీ లేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ కుక్క బెడదను అరికట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.