పూటుగా మందుకొట్టి బస్సు నడిపిన డ్రైవర్.. ప్రయాణికుల హాహాకారాలు!
- తెలంగాణలోని సూర్యాపేటలో ఘటన
- సూర్యాపేట-వేములవాడ బస్సు డ్రైవర్ నిర్వాకం
- ఆందోళనకు దిగిన ప్రయాణికులు
సూర్యాపేట డిపోకు చెందిన అద్దె బస్సు ఈరోజు సూర్యాపేట నుంచి వేములవాడకు బయలుదేరింది. ఈ బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే సూర్యాపేట జిల్లా నిమ్మికల్ వద్దకు రాగానే డ్రైవర్ చారి బస్సును ఓ ఇంటి వద్ద నిలిపాడు. అనంతరం లోపలకు వెళ్లి పూటుగా మద్యం సేవించి వచ్చాడు. బస్సును కొద్దిదూరం సరిగ్గానే నడిపినప్పటికీ, ఆ తర్వాత మాత్రం తూగడం మొదలుపెట్టాడు. దీంతో బస్సు అటూఈటూ ఊగిపోతూ ప్రయాణించడం మొదలుపెట్టింది.
దీన్ని గమనించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో కండక్టర్ వీరందరినీ మరో బస్సులో ఎక్కించి పంపించివేశారు. అనంతరం బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో పోలీస్ అధికారులు కేసు నమోదుచేయలేదు.