అమెరికా అబ్బాయి చేయందుకున్న చిత్తూరు అమ్మాయి!
- ఖండాంతరాల ప్రేమ పండిన వైనం
- పెళ్లితో ఒక్కటైన సాఫ్ట్ వేరు ఇంజినీర్లు
- ఘనంగా వివాహం
చిత్తూరు ఉషానగర్ కు చెందిన సుధాకర్, కుమారిల తనయ శ్రీనిరీష 2013లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. అక్కడే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతుండగా సహాధ్యాయి ఆండ్రూ గ్రెయినర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఎంఎస్ పూర్తయిన పిమ్మట ఇద్దరూ అక్కడే సాఫ్ట్ వేర్ కొలువులు సంపాదించుకున్నారు. వీరి ప్రేమకు ఆండ్రూ తల్లిదండ్రులు పీటర్ గ్రెయినర్, షారోన్ కూడా అంగీకరించారు. ఇటు, భారత్ లో ఉన్న తన తల్లిదండ్రులను శ్రీనిరీష ఒప్పించడంతో వీరి పెళ్లికి మార్గం సుగమం అయింది.