మణికొండలో ఆడుకుంటూ.. కాలువలో పడి ఐదేళ్ల బాలుడి మృతి
- తోటి పిల్లలతో ఆడుకుంటూ పడిపోయిన బాలుడు
- పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
- మృతదేహం వెలికితీత
ఈ కాలువ పక్కన స్థానిక నివాసితుల పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో ఆనంద్ అనే పిల్లాడు ఆట సరదాలో పడి అదుపు తప్పి కాలువలో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో కాలువలో గల్లంతైన బాలుడి కోసం వెతికారు. కాసేపటికి బాలుడి మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు గొల్లుమన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.