BJP: జైషే చీఫ్‌ మసూద్‌ను ‘గారు’ అని సంభోదించిన కేంద్ర మంత్రి : ఇరకాటంలో బీజేపీ

షార్ట్స్‌లో చూడండి
జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను ‘జీ’ (గారు) అని కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా సంబోధించడంతో బీజేపీ ఇరకాటంలో పడింది. బీహార్‌లోని రామ్‌గఢ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ ఈ విధంగా నోరు జారారు. మహా కూటమిలో కీలకనేతగా ఉన్న బీహార్‌ నేత జితన్‌ రాం మాంజీ ‘మజూర్‌ అజార్‌ సాహెబ్‌’ అని వ్యాఖ్యానించడాన్ని తప్పుపడుతూ బీజేపీ నేతలు విమర్శలు ఎక్కువపెట్టిన విషయం తెలిసిందే. మసూద్‌ను సాహెబ్‌ అనడం ద్వారా కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ఉగ్రవాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తేలిపోయిందంటూ బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. అయితే  ఇది జరిగిన కొద్ది గంటల్లోనే సిన్హా మాటలు బయటకు రావడంతో బీజేపీ నేతల గొంతులో వెలక్కాయ పడినట్టయింది. 
Go Back to Shorts
BJP
ajad masud
jayath sinha
bihar

More Telugu News