‘ఈనాడు’ అధినేత రామోజీరావుపై క్రిమినల్, సివిల్ కేసులు పెట్టండి!: రిటైర్డ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు పిటిషన్
- అనంతపురంలోని మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు
- తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు రాశారని మండిపాటు
- విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కోర్టు
తనపై తప్పుగా కథనాలు రాశారంటూ రిటైర్డ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు ఉమ్మడి హైకోర్టులో 2012లో పరువు నష్టం దావా దాఖలు చేశారు. రామోజీరావు, కిరణ్ లపై క్రిమినల్, సివిల్ కేసు నమోదు చేయాలని కోరారు. అయితే అదే ఏడాది వీరిద్దరూ విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. కానీ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. దీంతో వెంకటేశ్వరరావు అనంతపురంలోని మొబైల్ కోర్టును ఆశ్రయించారు.