సంస్కరణలకు దిగిన ఉన్నత విద్యామండలి.. ముగ్గురు వీసీలతో కమిటీ
- ఉప కులపతులతో సమావేశం
- నెల రోజుల్లో నివేదిక అందజేయాలి
- డిగ్రీ ప్రవేశాల కోసం 9న నోటిఫికేషన్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులు, డిగ్రీతో సంప్రదాయ కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు సూచించేందుకు ముగ్గురు ఉపకులపతులతో ఉన్నత విద్యా మండలి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం 10 నుంచి 27 వరకూ దోస్త్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నారు.