హైదరాబాద్ సిటీ బస్సులో తుపాకి కాల్పుల కలకలం .. నిందితుడి కోసం పోలీసుల గాలింపు!

  • ఫుట్ బోర్డుపై నిలుచున్న ప్రయాణికుడు
  • దిగేందుకు ససేమిరా అనడంతో వాగ్వాదం
  • గొడవ తీవ్రంకావడంతో గాల్లోకి కాల్పులు
హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్సులో ఈరోజు తుపాకి కాల్పులు జరిగాయి. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ఈరోజు పంజాగుట్ట చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు వెళ్తున్న 47 ఎల్‌ ఆర్టీసీ బస్సులో సఫారి సూట్ వేసుకున్న ఓ వ్యక్తి ఎక్కాడు.

ఈ సందర్భంగా ఫుట్ బోర్డుపై నిలుచున్న అతడిని కిందకు దిగాలని డ్రైవర్ కోరగా, దిగనని మొండికేశాడు. ఈ సందర్భంగా ప్రయాణికులతో వాగ్వాదం చెలరేగడంతో ఒక్కసారిగా తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ పైనుంచి దూసుకెళ్లింది. కాగా, ఈ ఘటనపై ఇటు బస్సు డ్రైవర్, అటు కాల్పులు జరిపిన వ్యక్తి ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
rtc bus
gun shoot

More Telugu News