Anushka: ఆ అనుభూతిని వ్యక్తం చేయడానికి మాటలు ఉంటే బాగుండేది!: ‘జెర్సీ’పై అనుష్క

షార్ట్స్‌లో చూడండి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా వచ్చిన ‘జెర్సీ’ సినిమా మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమాలో నాని ‘అర్జున్’ అనే క్రికెటర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

తాజాగా ప్రముఖ నటి అనుష్క సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నారు. ‘‘జెర్సీ’ సినిమాలోని మ్యాచ్‌ చూసిన తర్వాత నేను పొందిన అనుభూతిని వ్యక్తం చేయడానికి మాటలు ఉంటే బాగుండేదనిపిస్తోంది. నిజంగా ఇది నాకు ఫ్యాన్‌ మూమెంట్‌ (ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ). నాని, మిగిలిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఈ సినిమాను మాకిచ్చినందుకు ధన్యవాదాలు’ అని అనుష్క పోస్ట్‌ చేశారు.
Go Back to Shorts
Anushka
Nani
Sradha Srinath
Gowtham Thinnanuri
Instagram
Jersy

More Telugu News