హాజీపూర్ కు వెళ్లిన మీడియాపై ప్రజల దాడి!
- కట్టలు తెగిన ప్రజల ఆగ్రహం
- తమ గ్రామంలోకి రావద్దంటూ దాడి
- పోలీసులపైనా విమర్శలు
ఈ ఉదయం ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటిని నాశనం చేసి, తగులబెట్టిన ప్రజలు, చిత్రీకరణకు వెళ్లిన మీడియానూ వదల్లేదు. కవరేజ్ కి వెళ్లిన తెలుగు వార్తా చానెళ్ల ప్రతినిధులు, కెమెరామెన్ లపై ప్రజలు దాడికి దిగారు. తమ గ్రామానికి రావద్దంటూ వారితో వాగ్వాదానికి దిగి, కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో రాచకొండ పోలీసులు అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలోకి మీడియాను అనుమతించేది లేదని ప్రజలు స్పష్టం చేయడంతో, చేసేదేమీ లేక మీడియా వెనుదిరగాల్సి వచ్చింది.