తన తండ్రి బయోపిక్ కోసం రంగంలోకి దిగిన సీనియర్ హీరోయిన్ రాధిక
- విలన్ గా మెప్పించిన ఎంఆర్ రాధ
- రాధిక సొంత బ్యానర్లో బయోపిక్
- దర్శకుడిగా ఎంఆర్ రాధ మనవడు
ఇలా ఎంఆర్ రాధ జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు వున్నాయి. రాధిక, నిరోషా ఆయన కూతుళ్లే .. కాకపోతే తల్లులు వేరు. ఇక రాధారవి .. ఎంఆర్ రాధ తనయుడే. అంతా కూడా తమిళ చిత్రపరిశ్రమలో బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంఆర్ రాధ బయోపిక్ ను తన సొంత బ్యానర్లో నిర్మించడానికి రాధిక రంగంలోకి దిగారు. ఎంఆర్ రాధ పాత్ర కోసం శింబును .. ఎంజీఆర్ పాత్రకి గాను అరవిందస్వామిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఎంఆర్ రాధ మనవడైన 'ఐకీ' ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడట.