Telugudesam: ఆ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సుజనా చౌదరి

షార్ట్స్‌లో చూడండి
సీబీఐ తనకు పంపిన సమన్లపై టీడీపీ నేత సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సీబీఐ జారీ చేసిన సమన్లు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీకి చెందినవని, ఈ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాల్లో లేనని అన్నారు. 2003 నుంచి 2014 వరకు మూడు లిస్టెడ్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నానని అన్నారు. ఆ మూడు కంపెనీలు సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, నియాన్ టవర్స్ అని చెప్పిన సుజనా చౌదరి, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Telugudesam
Sujana Chowdary
cbi
summons
bangalore

More Telugu News