యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేస్తున్న వ్యక్తికి దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

  • యువతిని తెలిసిన వారింటికి తీసుకెళ్లిన రాంబాబు
  • మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్‌‌ను తాగించి అత్యాచారం
  • సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి తరచూ వేధింపులు
యువతికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసి దానిని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, ఆ వీడియోను చూపిస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తికి యువతి బంధువులు దేహశుద్ధి చేసి, ఆపై పోలీసులకు అప్పగించారు. ఆ వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, ఎల్బీ చర్ల ప్రభుత్వాసుపత్రిలో రాంబాబు అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం ఓ యువతిని తనకు తెలిసిన వారింటికి తీసుకెళ్లి అక్కడ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ యువతి మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం జరిపి దానిని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను తరచూ చూపిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. రాంబాబు వేధింపులు ఎక్కువ కావడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో విషయం తెలుసుకున్న యువతి బంధువులు రాంబాబును చితకబాది పోలీసులకు అప్పగించారు.
Go Back to Shorts
Rambabu
West Godavari District
Narsapuram
Cool Drink
Police

More Telugu News