టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు!

  • అనంతపురం జిల్లా ఉరవకొండలో ఘటన
  • 180 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అన్న వైసీపీ
అనంతపురం జిల్లా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఉరవకొండలో ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులకు తెలియకుండా పయ్యావుల కేశవ్ బూదగవి ప్రాంతంలో 180 మందికి రాత్రికిరాత్రే ఇళ్ల పట్టాలు ఇప్పించారని ఆరోపించారు.

ఇందుకోసం పదవీవిరమణ చేసిన ఎమ్మార్వో తిప్పమ్మ సంతకాన్ని టీడీపీ నేతలు ఫోర్జరీ చేశారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు వైసీపీ జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Anantapur District
Telugudesam
YSRCP
Payyavula Keshav

More Telugu News