'దబాంగ్ 3'లో ఛాన్స్ దక్కించుకున్న అలీ
- ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన 'దబాంగ్ 3'
- సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా
- ప్రతినాయకుడిగా సుదీప్
'దబాంగ్' సిరీస్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సిరీస్ లో చిన్న ఛాన్స్ దొరకడం కూడా అంతా ఆషామాషీ విషయమూ కాదు. అలాంటిది 'దబాంగ్ 3'లో చేసే అవకాశాన్ని అలీ దక్కించుకున్నాడు. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో అలీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఆ సమయంలోనే ఈ సినిమా సెట్ లో సల్మాన్ తో కలిసి తన ఫ్యామిలీతో అలీ ఫొటో దిగాడు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సుదీప్ విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే.