Chandrababu: రేపు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంటిమిట్టలో రాములవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా రాతివనాలు ప్రాంతాన్ని దర్శించిన ఆయన రేపు తిరుపతి వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం 4.45 గంటలకు ఆయన తిరుపతి బయల్దేరనున్నట్టు సమాచారం. తిరుపతి పర్యటన సందర్భంగా చంద్రబాబు కోటకొమ్మల వీధిలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించనున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, నారా రోహిత్ తదితర కుటుంబ సభ్యులు కూడా బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలుస్తోంది.
Go Back to Shorts
Chandrababu
Tirupati

More Telugu News