ఏపీలో భారీగా పోలింగ్ నమోదయింది.. ఇది టీడీపీ విజయానికి కారణం కాబోతోంది!: మంత్రి అమర్నాథ్ రెడ్డి
- గతంలో ఇంతలా పోలింగ్ జరగలేదు
- కేసీఆర్ తరహాలో మోదీ సాయం కోసం జగన్ ప్రయత్నించారు
- చిత్తూరులో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత
చిత్తూరు జిల్లాలో ఈరోజు మీడియాతో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ తరహాలో ఏపీ ఎన్నికల్లో మోదీ సాయం పొందేందుకు జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం టీడీపీ గెలుపునకు కారణం కాబోతోందని అభిప్రాయపడ్డారు.