మోదీ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం?
- వారణాసిలో మోదీని చంద్రబాబు ఎండగడతారు
- మే 23న టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయి
- చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసీపై విమర్శలు వస్తున్నాయి
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23వ తేదీన టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయని బుద్ధా వెంకన్న అన్నారు. 23న వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఏన్నడూ రానంతగా ఈసీపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని... దీనికి కారణం ఇది మోదీ నియమించిన ఈసీ కావడమేనని చెప్పారు. ఈసీ మద్దతుతోనే వైసీపీ అరాచకాలకు తెగబడిందని అన్నారు. అరాచకాలకు పాల్పడిన వైసీపీకే మోదీ నియమించిన గవర్నర్ కూడా అపాయింట్ మెంట్ ఇస్తారని విమర్శించారు.