హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా ఆస్తుల జప్తు
- 1993-2006 మధ్య రూ.6.09 కోట్ల ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణ
- ఓం ప్రకాశ్ చౌతాలతోపాటు ఆయన కుమారులపైనా ఎఫ్ఐఆర్
- ఢిల్లీ, పంచకుల, సిర్సాలోని ఆస్తులు స్వాధీనం
మనీలాండరింగ్ కేసులో చౌతాలాతోపాటు ఆయన కుమారులు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. 1993-2006 మధ్య చౌతాలా మొత్తం రూ.6.09 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది.