jabardasth viinod: కేరక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలని వుంది: 'జబర్దస్త్' వినోద్

షార్ట్స్‌లో చూడండి
'జబర్డస్త్' కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ వేదికపై లేడీ గెటప్స్ ద్వారా సందడి చేసే వాళ్లలో 'వినోద్' ఒకరు. లేడీ గెటప్పులోనే ఆయన స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటాడు గనుక, 'వినోదిని' అంటేనే వెంటనే గుర్తిస్తారు.

కోటేరు ముక్కుతో అచ్చం అమ్మాయిలా కనిపించే వినోద్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా నాకు ఇంతటి గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. బుల్లితెరపై నాకు మంచి ఆదరణ లభించింది .. వెండితెరపై కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాను. అలాగని చెప్పేసి బెస్ట్ విలన్ కావాలనీ .. బెస్ట్ కమెడియన్ అనిపించుకోవాలని లేదు. వినోద్ కి ఏ పాత్ర ఇచ్చినా చాలా బాగా చేస్తాడు అనేలా మంచి కేరక్టర్ ఆర్టిస్ట్ ను కావాలని వుంది. వెండితెరపై కూడా లేడీ గెటప్పులో కనిపించడానికి నేను వెనుకాడను" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
jabardasth viinod

More Telugu News