బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నోట ‘పాకిస్థాన్’ పాట.. దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు!

  • పాక్ ఆర్మీ పాటను కాపీకొట్టిన రాజాసింగ్
  • హిందుస్థాన్ జిందాబాద్ అంటూ కొత్త భాష్యం
  • సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త తలనొప్పిని కొనితెచ్చుకున్నారు. ఇటీవల ఆయన ‘దిల్ కీ ఆవాజ్.. హర్ దిల్ కీ ఆవాజ్.. హిందుస్థాన్ జిందాబాద్’ అనే పాటను స్వయంగా ఆలపించారు. ఈ గీతాన్ని శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. దీన్ని భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు రాజాసింగ్ ప్రకటించారు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఒకటుంది.

ఈ పాట విడుదలైన వెంటనే తమ ఆర్మీకి చెందిన ఈ పాటను రాజాసింగ్ కాపీ కొట్టారని పాకిస్థాన్ ఆరోపించింది. రాజాసింగ్ రూపొందించిన పాట ‘‘దిల్ కీ ఆవాజ్.. హర్ దిల్ కీ ఆవాజ్.. పాకిస్థాన్ జిందాబాద్’ను మార్చి రాసిందేనని స్పష్టం చేసింది. ఈ పాటను పాక్ రచయిత సహిర్ అలీ బగ్గా రాశారని పేర్కొంది. ఈ విషయమై పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ గఫూర్ స్పందిస్తూ..‘ఈ పాటను కాపీ చేసినందుకు సంతోషం. కానీ కాపీకి సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టాలి కదా!’ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ పాడిన పాటను, అసలు పాటను పోస్ట్ చేశారు. మరోవైపు రాజాసింగ్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పాక్ పాటను, రాజాసింగ్ పాటను పోస్ట్ చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.
Go Back to Shorts
India
BJP
rajasingh
Pakistan
army song
Social Media

More Telugu News