Arvind Kejriwal: ఎవరికి వేసినా బీజేపీకే ఓటు వెళ్లేలా ఈవీఎంలో ప్రోగ్రామ్ చేశారు: కేజ్రీవాల్ ఆరోపణ

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈవీఎంల విషయంలో తనకు కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాల కారణంగా దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందని అన్నారు. ఈవీఎంలపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వీవీ ప్యాట్లను తప్పనిసరిగా లెక్కించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అంతేగాకుండా, దేశాన్ని పాలిస్తున్న బీజేపీపైనే ఆయన ప్రధాన ఆరోపణ చేశారు. ఈవీఎంలో ఏ గుర్తుకు ఓటేసినా అది బీజేపీకి వెళ్లేలా ప్రోగ్రామ్ చేశారంటూ ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి సాగిస్తున్న పోరాటానికి కపిల్ సిబాల్, అభిషేక్ మనుసింఘ్వీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు. ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
Go Back to Shorts
Arvind Kejriwal
BJP

More Telugu News